![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -232 లో.....సీతారాముల కళ్యాణం జరిపించడానికి రుద్ర, గంగ దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేస్తారు. మరొకవైపు పెద్దసారుని చంపడానికి వీరు మనుషులు అడుగడుగునా ఉంటారు కానీ వాళ్ళ భారీ నుండి పెద్దసారుని కాపాడుతాడు రుద్ర. అసలు బ్రో ఏం చేస్తున్నాడని ఇషిక టెన్షన్ పడుతుంది. అది రంగా చూసి ఇందుమతిని పిలిచి.. నీ కోడలు చూడు ఏం చేస్తుంది దేవుడికి మొక్కకుండా ఖాళీగా ఉందని రంగా చెప్పగానే ఇషిక దగ్గరికి ఇందుమతి వెళ్లి పానకం రెడీ చేయమని చెప్తుంది.
నాకు తెలియదు అన్నట్లు ఇషిక అంటుంది. అప్పుడే గంగ వచ్చి నేను చేస్తాను.. నువ్వు అందరికి ఇవ్వు అని గంగ అంటుంది. స్నేహ, వంశీ, సూర్య సహాయంతో గంగ పానకం రెడీ చేస్తుంది. అక్కడ నుండి అందరు వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇషిక పానకంలో ఏదో కలుపుతుంది. కాసేపటికి సీతారాముల కళ్యాణం జరుగుతుంది. ఆ తర్వాత అందరు కోలాటం ఆడుతారు. గంగ పానకం తీసుకొని వచ్చి అందరికి ఇవ్వడానికి వస్తుంది. వీరు దూరం నుండి పెద్దసారుని పాయింట్ అవుట్ చేసి గన్ తో షూట్ చేస్తాడు. దాంతో పెద్దసారు పడిపోతాడు. వెంటనే హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు.
అక్కడికి వీరు ఏం తెలియనట్లు వచ్చి.. అలా ఎలా జరిగింది అంటూ అడుగుతాడు. మావయ్య అందరికి మంచి చేస్తాడు.. మావయ్యకి ఎవరు హాని కలిగించారని వీరు అంటాడు. ఎవడో ఇలా చేశాడని వీరుని ఉద్దేశ్యించి రంగా అంటాడు. తరువాయి భాగంలో ఇషిక, వీరు వెళ్తుంటే వాళ్ళకి ఎదురుగా రుద్ర హెల్మెట్ పెట్టుకొని ఉంటాడు. అతను రుద్ర అని వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు ఆ రుద్ర కావాలనే నన్ను ఎటాక్ చేసాడని ఇంట్లో నిరూపిస్తానని కార్ దిగి రుద్ర దగ్గరికి వెళ్తాడు. రుద్ర కొడుతుంటే ఇషిక వీడియో తీస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |